తెలంగాణ

telangana

ETV Bharat / crime

శ్రీకాంతాచారి తండ్రి అదృశ్యం.. ఆయన వద్దే ఉండొచ్చు..! - శ్రీకాంతాచారి తండ్రి అదృశ్యం

Srikanthachari Father missing: మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి(55) అదృశ్యమైనట్లు హయత్​నగర్​ పీఎస్​లో కేసు నమోదైంది. జూన్‌ 1న మధ్యాహ్నం పని నిమిత్తం బయటకు వెళ్తున్నట్లు చెప్పాడని ఆయన భార్య శంకరమ్మ పోలీసులకు తెలిపింది.

Srikanthachari Father missing
తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తండ్రి అదృశ్యం

By

Published : Jun 12, 2022, 7:48 AM IST

Srikanthachari Father missing: మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి(55) అదృశ్యమైన సంఘటన హయత్‌నగర్‌ పోలీసు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. హయత్‌నగర్‌ పరిధిలోని సూర్యనగర్‌ కాలనీ రోడ్డు నంబర్‌-8లో వెంకటాచారి ఆయన భార్య శంకరమ్మ కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నారు.

'జూన్‌ 1న మధ్యాహ్నం పనిట నిమిత్తం వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. మరుసటి రోజు తన భర్త సామాజిక మాధ్యమాల్లో కనిపించాడని, ఆ తర్వాత పలుమార్లు ఫోన్‌ చేసినా సమాధానం లేదు' అని శంకరమ్మ పోలీసులకు వెల్లడించింది. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ వద్ద ఆశ్రయం పొందుతుండొచ్చని శంకరమ్మ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details