Fake Liquor Seized:ఒడిశాలో మద్యం తయారీ డిస్టిలరీలో తెలంగాణ ఎక్సైజ్ పోలీసుల సోదాలు నిర్వహించారు. భారీగా అక్రమ మద్యం, ముడిసరకు, లేబుళ్లను అధికారులు సీజ్ చేశారు. దాదాపు రూ.10 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.కోటికి పైగా విలువైన మద్యం ప్యాకింగ్ చేసే యంత్రాలు సీజ్ చేశారు. ఇటీవల నల్గొండ, చౌటుప్పల్, రంగారెడ్డిలో భారీగా మద్యం స్వాధీనమైంది. ఒడిశా నుంచి మద్యం సరఫరా అయినట్లు అధికారులు గుర్తించారు. విచారణలో ఎక్సైజ్ బృందం భాగంగా ఒడిశాకు వెళ్లారు.
ఒడిశాలో తెలంగాణ ఎక్సైజ్ పోలీసుల సోదాలు... రూ.10 కోట్ల విలువైన మద్యం సీజ్
Fake Liquor Seized: ఒడిశాలో తెలంగాణ ఎక్సైజ్ పోలీసుల సోదాలు చేపట్టారు. దాదాపు రూ.10 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.కోటికి పైగా విలువైన మద్యం ప్యాకింగ్ చేసే యంత్రాలు సీజ్ చేశారు.
ఒడిశాలో తెలంగాణ ఎక్సైజ్ పోలీసుల సోదాలు
రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ రవికాంత్ ఆధ్వర్యంలో ఒడిశాకు పయనమయ్యారు. అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య ఆధ్వర్యంలో ఒడిశాకు వెళ్లిన ఎక్సైజ్ బృందం... ఒడిశా పోలీసుల సహకారంతో టాంగీలోని మద్యం తయారీ కేంద్రంలో సోదాలు నిర్వహించారు. భారీగా అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులను, ఒడిశాకు చెందిన ఒకరిని అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: