తెలంగాణ

telangana

ETV Bharat / crime

Couple Suicide Attempt in Guntur : ఏపీలో తెలంగాణ జంట ఆత్మహత్యాయత్నం.. కారణమేంటంటే..? - Telangana Lovers Suicide Attempt in Guntur

Couple Suicide Attempt in Guntur: ఒకే ఊళ్లో పుట్టిన ఆ జంట ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారి ప్రేమను మరో మెట్టు ఎక్కించడానికి పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ ఇరువైపుల పెద్దలకు ఇష్టం లేకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. అక్కడే ఉంటే వారి ప్రేమకు పెద్దలు అడ్డొస్తారని ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కాపురం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫు వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. అక్కడేమైందో ఏమో.. స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిన ఆ దంపతులు భోజనంలో విషం కలుపుకుని తిని ఆత్మహత్యకు యత్నించారు.

Lovers Suicide Attempt in Guntur
Lovers Suicide Attempt in Guntur

By

Published : Mar 19, 2022, 9:39 AM IST

Couple Suicide Attempt in Guntur : నల్గొండ జిల్లా అడవి దేవరపల్లికి చెందిన ఆటో మెకానిక్ హాజీబాబా.. అదే గ్రామానికి చెందిన మాధవి ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి ప్రేమకు ఇరువైపుల పెద్దలు అంగీకరించకపోవడంతో రెండు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. ఇంట్లో వాళ్లకు భయపడి ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు వెళ్లారు. అక్కడ శాంతినగర్‌లో కాపురం పెట్టారు. ఎలాగో ఈ విషయం తెలుసుకున్న మాధవి కుటుంబ సభ్యులు అడవిదేవరపల్లి పోలీసులకు తమ కూతురు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈనెల 15న శాంతినగర్‌కు చేరుకుని దంపతులిద్దరిని అడవిదేవరపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.

Telangana Couple Suicide in AP : హాజీబాబా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మాట్లాడి.. దంపతులిద్దరినీ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయించారు. అక్కడి నుంచి శాంతినగర్‌ తిరిగివచ్చిన దంపతులు.. పోలీసులు తమపై వ్యవహరించిన తీరుతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తీవ్ర ఆవేదనతో ఈనెల 17న రాత్రి భోజనంలో విషం కలుపుకుని తిని ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు వారిని పిడుగురాళ్లలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

ప్రాణాపాయం నుంచి బయట పడ్డ బాధితులు నరసరావుపేట రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల తమను ఇంటి దగ్గర కొట్టడంతోపాటు స్టేషన్‌కు తీసుకెళ్లి వేధించారని దంపతులు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details