పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయురాలిని టీనేజీ ప్రేమ వేధింపులకు గురి చేస్తోంది. డెంటల్ కాలేజీలో చదివే రోజుల్లో తీసుకున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుండగా, వాటిని తొలగించాలని లేఖలు రాసినా ఆయా సంస్థలు స్పందించకపోవడంతో హైదరాబాద్‌లో ఉన్న ఆమె తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి నగ్న చిత్రాలను తీసుకున్నాడని, 8 నెలల తర్వాత వారు విడిపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం తన కుమార్తె అయిదేళ్ల బాబుతో ఆస్ట్రేలియాలో స్థిరపడిందన్నారు. 2012లో ప్రేమికుడు ఫొటోలను సామాజిక మాధ్యమాలతోపాటు, ఇంటర్నెట్‌లో పెట్టగా ఫిర్యాదు చేయడంతో తొలగించారని, తిరిగి 2019లో మళ్లీ ఫొటోలు కనిపించాయన్నారు. దీనిపై ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్‌కు లేఖలు రాసినా స్పందించలేదన్నారు.
సోషల్ మీడియాలో నగ్నచిత్రాలు.. గృహిణిని వేధిస్తున్న టీనేజీ ప్రేమ - Teenage love chasing a housewife
కాలేజీలో చదివే రోజుల్లో తీసుకున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుండగా.. వాటిని తొలగించాలని ఆయా సంస్థలకు ఓ గృహిణి లేఖ రాసింది. ఆ సంస్థలు స్పందించకపోవడంతో హైదరాబాద్‌లో ఉన్న ఆమె తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇలాగే సోషల్ మీడియాలో ఫొటోలు కనిపిస్తే ఫిర్యాదు చేశామని.. అప్పుడు తొలగించారని.. తిరిగి 2019లో మళ్లీ ఫొటోలు కనిపించాయని.. దీనిపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు.
![సోషల్ మీడియాలో నగ్నచిత్రాలు.. గృహిణిని వేధిస్తున్న టీనేజీ ప్రేమ teenage-love-is-chasing-a-housewife-in-australia](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11120596-70-11120596-1616476932832.jpg)
మరోవైపు ఈ ఫొటోలను తాను సామాజిక మాధ్యమాల్లో పెట్టలేదని ప్రేమికుడు చెబుతున్నాడన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి నిందితులపై ఫిర్యాదుకు సంబంధించి దర్యాప్తు ఏ దశలో ఉంది? నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ సైబర్‌క్రైమ్ పోలీసులను ఇటీవల ఆదేశించారు. అదేవిధంగా గూగుల్, ట్విటర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలకు నోటీసులు జారీ చేశారు. మాజీ స్నేహితుల వల్ల సమాచారం దుర్వినియోగం అవుతున్నపుడు గోప్యతకు తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. బాధితురాలి లేఖపై ఎందుకు చర్య తీసుకోలేదో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొన్నారు. నిందితులపై చర్య తీసుకునేలా చూడాలని కోరుతూ కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు వినతి పత్రం సమర్పించాలని పిటిషనర్‌కు సూచిస్తూ విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేశారు.
- ఇదీ చదవండి :అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని మృతి