తెలంగాణ

telangana

ETV Bharat / crime

పాఠాలు చెప్పాల్సిన గురువే పాడు పని.. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తన - Warangal Urban District Latest Crime News

Teacher Misbehavior With Student: పాఠాలు చెప్పాల్సిన గురువే.. పాడు పని చేశాడు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు. ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.

Teacher misbehavior with student in Mulugu District
Teacher misbehavior with student in Mulugu District

By

Published : Nov 30, 2022, 7:27 PM IST

Teacher Misbehavior With Student: విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే దారితప్పాడు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు కామంతో రగిలిపోయాడు. అభం శుభం తెలియని ఓ బాలికను లైంగిక వేధించాడు. ఈ ఘటన ములుగు జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ బాలిక పదో తరగతి చదువుతుంది.

అదే పాఠశాలలో తప్పని కృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆధార్ కార్డు వెరిఫికేషన్ కోసం అంటూ పదో తరగతి విద్యార్థులను గదిలోకి పిలిపించాడు. అందరూ వెళ్లిపోయాక ఆ బాలికను మాత్రమే కాసేపు ఉండమని చెప్పి లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు ములుగు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ములుగు ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై ఓంకార్ యాదవ్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details