తెలంగాణ

telangana

ETV Bharat / crime

విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే.. విద్యార్థినితో అసభ్యకరంగా.! - చిన్నారులపై అఘాయిత్యాలు

నైతిక విలువలు మంటగలిసిపోతున్నాయి. ఎక్కడ చూసినా చిన్నారులు, మహిళలు, వృద్ధులపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. ఇంటా బయటా వారికి రక్షణ లేకుండా పోతోంది. చివరకు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి.. వారిని సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులు కూడా వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్​లో ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ ఉపాధ్యాయుడు.

teacher harassment on a student
విద్యార్థినితో టీచర్ అసభ్య ప్రవర్తన

By

Published : Sep 16, 2021, 6:02 PM IST

ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ ఉపాధ్యాయుడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్​ బహదూర్​పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఓ విద్యార్థిని ఆరో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బుధవారం తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని బాలిక.. తన తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుడిపై బహదూర్​పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:Raju postmortem: ఎంజీఎం ఆస్పత్రికి రాజు కుటుంబసభ్యులు.. కాసేపట్లో మృతదేహానికి శవపరీక్ష

ABOUT THE AUTHOR

...view details