తెలంగాణ

telangana

ETV Bharat / crime

'సోదిక్లాస్‌' అంటూ విద్యార్థిని పోస్ట్.. టీచర్ రియాక్షన్​తో సీన్ రివర్స్​! - సోది క్లాస్ అని సామాజిక మాధ్యమంలో పోస్ట్

A Teacher Crushed a Student: పాఠం చెప్తున్నప్పుడు ఫొటో తీసి..‘సోది క్లాస్‌’ అని పేర్కొంటూ ఒక విద్యార్థిని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు ఆమెతో పాటు తరగతిలోని మరికొందరు అమ్మాయిలను చితకబాదారు. ఈ ఘటనను కొందరు బాలురు వీడియో తీశారు. బాలికలు బోరున విలపిస్తూ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయురాలితో వాగ్వాదానికి దిగారు. ఆమెను సస్పెండ్‌ చేయాలని ధర్నా చేశారు.

Teacher Who Crushed the Student
Teacher Who Crushed the Student

By

Published : Nov 30, 2022, 11:39 AM IST

A Teacher Crushed a Student: పాఠం చెప్తున్నప్పుడు ఫొటో తీసి..‘సోది క్లాస్‌’ అని పేర్కొంటూ ఒక విద్యార్థిని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు ఆమెతో పాటు తరగతిలోని మరికొందరు అమ్మాయిలను చితకబాదారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం మేనూర్‌ ఆదర్శ (మోడల్‌) పాఠశాలలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు నాలుగు రోజుల క్రితం తెలుగు ఉపాధ్యాయురాలు మహేశ్వరి పాఠం బోధిస్తుండగా ఓ విద్యార్థిని సెల్‌ఫోన్‌లో ఫొటో తీసింది. ‘సోది క్లాస్‌’ అని పేర్కొంటూ సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయురాలు తరగతి గదిలోకి సెల్‌ఫోన్‌ తీసుకురావడమే కాకుండా..తన ఫొటో ఎందుకు తీశావని నిలదీశారు. దాంతో విద్యారిన్థి తప్పయింది.. క్షమించండని వేడుకుంది.

అయినప్పటికీ ఆగ్రహం తగ్గని ఉపాధ్యాయురాలు గది తలుపులు పెట్టి అమ్మాయిలను ఒకచోట నిలబెట్టి కొందరిని కర్రతో చితకబాదారు. ఈ ఘటనను కొందరు బాలురు వీడియో తీశారు. బాలికలు బోరున విలపిస్తూ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయురాలితో వాగ్వాదానికి దిగారు. ఆమెను సస్పెండ్‌ చేయాలని ధర్నా చేశారు.

ఈ విషయంపై మహేశ్వరిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. సామాజిక మాధ్యమంలో తన ఫొటో పెట్టినందుకు కొట్టిన మాట వాస్తవమేనని తెలిపారు. ప్రిన్సిపల్‌ లావణ్యను సంప్రదించగా.. ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపి, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఉపాధ్యాయురాలు మహేశ్వరిపై ఓ విద్యార్థిని మంగళవారం సాయంత్రం మద్నూర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై శివకుమార్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details