జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణానికి చెందిన ముద్దాసి స్వాములు బైరంపల్లి శివారులో మినుము పంట వేశారు. పంటకు నీళ్లు పెట్టే విషయంలో స్వాములుకు అదే గ్రామానికి చెందిన తిక్కస్వామికి మధ్య వివాదం తలెత్తింది. గొడవ ముదిరి తోపులాటకు దారితీసింది. ఈ తోపులాటలో కిందపడ్డ స్వాములు తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.
పొలం వద్ద జరిగిన తోపులాటలో ఉపాధ్యాయుడు మృతి - farm water dispute in alampur
పొలం వద్ద జరిగిన ఘర్షణలో ఓ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పొలం వద్ద జరిగిన తోపులాటలో ఉపాధ్యాయుడు మృతి
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు స్వాములు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- ఇదీ చూడండి :వంతెనపై నుంచి పడిన సిమెంట్ లారీ.. ఇద్దరు మృతి