తెలంగాణ

telangana

ETV Bharat / crime

student gets pregnant by teacher : విద్యార్థినిని గర్భవతిని చేసిన ట్యూషన్ మాస్టార్ - student gets pregnant by teacher

తల్లిదండ్రుల తర్వాత.. ఈ సృష్టిలో అత్యంత గొప్ప స్థానం గురువుది. ప్రతిఒక్కరి జీవితంలో గురువుకు ఉండే స్థానం చాలా మహోన్నతమైనది. పాఠాలే కాదు.. మంచిచెడులు చెప్పి.. జీవితమంటే ఏంటో తెలిపే దిక్సూచి గురువు. అలాంటి గొప్పస్థానంలో ఉన్న గురువు.. తన వద్ద విద్య నేర్చుకోవడానికి వచ్చిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడితే.. విలువలు నేర్పాల్సిన వాడే.. చెరబడితే? అలాంటి ఘటనే ఏపీలోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. పదోతరగతి విద్యార్థినిని గర్భవతిని(student gets pregnant by teacher) చేశాడో కీచకమాస్టార్.

student gets pregnant by teacher
student gets pregnant by teacher

By

Published : Sep 23, 2021, 9:35 AM IST

అభంశుభం తెలియని వయస్సు. అప్పుడప్పుడే భవిష్యత్​పై ఆశలు.. బాగా చదివి అమ్మానాన్నకు పేరు తీసుకురావాలనే ఆలోచన.. మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలనే తపన. కరోనాతో అంతా అల్లకల్లోలం అవ్వడం వల్ల పాఠశాలలు సరిగ్గా నడవకపోవడం వల్ల ట్యూషన్​కు వెళ్తోంది ఆ అమ్మాయి. మూడేళ్ల నుంచి ఆ టీచర్​ వద్దే పాఠాలు నేర్చుకుంటోంది.

పాఠాలు నేర్పే ఆ గురువులో ఓ కీచకుడు(student gets pregnant by teacher) ఉన్నాడని పసిగట్టలేకపోయింది. నీకు తెలివి లేదు.. చదువు రాదు అంటే నిజమేమో.. తనదే తప్పేమో అనుకుంది. నీకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి అంటే.. మాస్టార్ తన చదువుపై తన కంటే శ్రద్ధ పెట్టి నేర్పిస్తున్నాడని సంబురపడింది. బాగా చదవాలని ఆశపడింది. ట్యూషన్​లో మిగిలిన విద్యార్థులంతా వెళ్లిపోయాక తనని ఉండమంటే.. స్పెషల్ క్లాస్​ చెబుతాడనుకుంది. కానీ తనని చెరబట్టి(student gets pregnant by teacher).. తన జీవితాన్ని నాశనం చేస్తాడని ఊహించలేకపోయింది. తన కల నెరవేరడంలో కీలక పాత్ర వహించి ఓ అడుగు ముందేయడానికి సహకరిస్తాడనుకుంటే.. తన కలలను కల్లలు చేసి గర్భవతిని(student gets pregnant by teacher) చేస్తాడని తెలుసుకోలేకపోయింది.

విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన పదోతరగతి విద్యార్థిని (16) మూడేళ్ల నుంచి ఓ ట్యూషన్‌ సెంటర్‌కు వెళుతోంది. ఆ అమ్మాయిపై ట్యూషన్‌ మాస్టారు కన్నేశాడు. మిగిలిన విద్యార్థులంతా వెళ్లిపోయాక.. ‘నీకు తెలివి లేదు.. మేధాశక్తి పెంచుతాను. అందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’ అంటూ బాలికను లోబర్చుకున్నాడు. కొన్ని రోజులుగా ఆ బాలిక సరిగ్గా తినకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆమె గర్భవతి(student gets pregnant by teacher) అని, ఎనిమిదో నెల అని వైద్యులు తెలిపారు. వెంటనే బాధితులు దిశ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు చిన్నాను అదుపులోకి తీసుకున్నామని దిశ డీఎస్పీ త్రినాథ్‌ తెలిపారు. ఇతడికి అక్క కుమార్తెతో పెళ్లయిందని, ఉద్యోగం రాకపోవడంతో ట్యూషన్‌ చెబుతున్నాడని చెప్పారు. నిందితుణ్ని రిమాండుకు తరలించామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details