కరోనా పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు సొమ్ముచేసుకుంటున్నాయి. వైద్యారోగ్య శాఖ నుంచి కనీస అనుమతులు తీసుకోకుండా ఎడాపెడా కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నాయి. ఆపై చికిత్స పేరిట వేలకువేలు దోచుకుంటున్నాయి.
అనుమతి లేకుండా కరోనా పరీక్షలు.. ఇద్దరు అరెస్ట్ - taskforce police rides on ankitha hospital at miryalaguda
అనుమతి లేకుండా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న.. మిర్యాలగూడలోని అంకిత నర్సింగ్ హోం, సిద్ధార్థ డయాగ్నస్టిక్ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు.
![అనుమతి లేకుండా కరోనా పరీక్షలు.. ఇద్దరు అరెస్ట్ task force rides on miryalaguda hospitals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11501450-147-11501450-1619102665432.jpg)
మిర్యాలగూడ ఆస్పత్రులపై టాస్క్‌ఫోర్స్ దాడులు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అంకిత నర్సింగ్‌హోంపై టాస్స్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆస్పత్రిలో అనుమతి లేకుండా కరోనా పరీక్షలు చేస్తున్న సిద్ధార్థ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని సీజ్ చేశారు. అంకిత నర్సింగ్‌హోం డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అనంతరం ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఇవీచూడండి:కరోనాతో కాదు.. భయంతో ప్రాణాలు విడిచాడు