కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో రహస్యంగా ఆన్లైన్ మట్కా ఆడుతున్న నలుగురు యువకులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.20,130 నగదు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
రహస్యంగా ఆన్లైన్ మట్కా గేమ్.. యువకులు అరెస్ట్ - online matka players in kagaj nagar
రహస్యంగా ఆన్లైన్ మట్కా ఆడుతున్న నలుగురు యువకులను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆన్లైన్ మట్కా ఆడుతున్న యువకులు అరెస్ట్
గాంధీచౌక్ ప్రాంతంలో గుట్టుగా ఆన్లైన్ మట్కా ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సీఐ రానా ప్రతాప్ దాడులు చేపట్టారు. వారిని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఆస్తి వివాదం.. సొంత అన్ననే అతి కిరాతకంగా హతమార్చాడు