కల్తీ మద్యం తయారుచేసి దుకాణాలకు సరఫరా చేస్తోన్న ఓ వ్యక్తిని రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని ఆర్కే కాలనీలో నివాసముండే పిట్టల సురేశ్ ఇంట్లో కల్తీ మద్యం తయారు చేస్తున్నారన్న ముందస్తు సమాచారంతో.. పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రూ. 78 వేల విలువ గల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్‌ఫోర్స్ దాడులు.. కల్తీ మద్యం పట్టివేత - home made alchohal
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. కల్తీ మద్యం తయారుచేస్తోన్న ఓ ఇంటిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులపై కేసు నమోదు చేసి భారీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
![టాస్క్‌ఫోర్స్ దాడులు.. కల్తీ మద్యం పట్టివేత adulterated alcohol](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-vlcsnap-2021-05-14-06h19m40s834-1405newsroom-1620953451-507.jpg)
adulterated alcohol
కల్తీ చేసిన మద్యాన్ని నిందితుడు.. ఇందారంలోని లక్ష్మీ గణపతి వైన్‌షాప్‌లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. సమాచారంతో ఆబ్కారీ శాఖ అధికారులతో కలిసి.. ఆ దుకాణంపై దాడి చేసి రూ.66 వేల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడుతోన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని.. దుకాణాన్ని సీజ్ చేశామన్నారు.
ఇదీ చదవండి:కేవైసీ ఆప్డేట్ నెపంతో ఒకర్ని.. ఉద్యోగం పేరుతో మరొకర్ని..!