తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న టాస్క్​ఫోర్స్​ - నారాణయపేట జిల్లాలో ఇసుక అక్రమరవాణా

నారాయణపేట జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాకు టాస్క్​ఫోర్స్​ పోలీసులు అడ్డుకట్టవేశారు. రెండు వేరు వేరు ఘటనల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. రెండు ట్రాక్టర్​లు, రెండు టిప్పర్లు, ఒక జేసీబీ స్వాధీనం చేసుకున్నారు.

task-force-police-to-prevent-sand-smuggling-in-narayanpet-district
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న టాస్క్​ఫోర్స్​

By

Published : Feb 21, 2021, 3:41 PM IST

Updated : Feb 21, 2021, 3:48 PM IST

నారాణయపేట జిల్లాలో రెండు వేరువేరు ఘటనల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఐదుగురిని టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. 30 ట్రాక్టర్ల ఇసుక డంప్​ను స్వాధీనం చేసుకుని నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు.

జిల్లా కేంద్రంలోని నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి పర్మిషన్ లేకుండా అర్ధరాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని వారిని స్థానిక పోలీస్ స్టేషన్​లో అప్పగించారు. కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మద్దూరులో..

మద్దూరు మండలం పరిధిలో అర్ధరాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లు, ఒక జేసీబీని టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్థానిక పోలీసు స్టేషన్​కు తరలించారు. జేసీబీ యజమానితో సహా మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేసిన మద్దూర్​ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:పెళ్లికి ఒప్పుకోలేదని యువతిపై హత్యాయత్నం

Last Updated : Feb 21, 2021, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details