తెలంగాణ

telangana

ETV Bharat / crime

టాస్క్​ఫోర్స్​ దాడుల్లో భారీగా గుట్కా ప్యాకెట్ల స్వాధీనం - హైదరాబాద్ సంతోశ్​ నగర్​లో గుట్కా సీజ్

హైదరాబాద్​ రియాసత్​ నగర్​లోని ఓ గోదాముపై టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. గోదాములో తరలించడానికి పెద్ద ఎత్తున సిద్ధంగా ఉంచిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

task force police can seized gutka in santhosh nagar
హైదరాబాద్ సంతోశ్​ నగర్​లో గుట్కా సీజ్

By

Published : Jun 16, 2021, 7:23 PM IST

గుట్టుచప్పుడు కాకుండా అడ్డదారిలో జరుగుతున్న గుట్కా రవాణాకు దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అడ్డుకట్టవేశారు. హైదరాబాద్​ సంతోష్‌నగర్‌ ఠాణా పరిధిలోని రియాసత్‌ నగర్‌లో ఓ గోదాముపై దాడి చేసిన అధికారులు భారీగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశామని తెలిపారు.

అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే దురాశతో నిందితుడు గోదాములో గుట్కా పాకెట్లను నిల్వచేసి.. చుట్టుపక్కల ప్రాంతాల్లోని కిరాణా దుకాణాలు, పాన్‌షాపులకు సరఫరా చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ గుట్కా పాకెట్లను ఎక్కడ తయారు చేస్తున్నారు? అతడికి ఎక్కడు నుంచి కొనుగోలు చేశాడు? ఎవరు సరఫరా చేశారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.


ఇదీ చదవండి:Kishan reddy: 'డిసెంబర్​ నాటికి దేశంలో ప్రజలందరికీ వ్యాక్సిన్​'

ABOUT THE AUTHOR

...view details