కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ డివిజన్లో అక్రమ మద్యం రవాణాకు పాల్పడిన నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర సరిహద్దులోని గూడెం వంతెన సమీపంలో మద్యం రవాణా చేస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. నిందితుల నుంచి రూ. 77 వేల 500 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత - telangana crime updates
కుమురంభీం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఖరీదైన మద్యం బాటిళ్లు సేకరించి అందులో చీప్ లిక్కర్‌తో పాటు నీళ్లు కలిపి అమ్ముతున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:'దీర్ఘకాలంలో ఊపరితిత్తులపై తీవ్ర ప్రభావం'