తెలంగాణ

telangana

ETV Bharat / crime

పేకాట ముఠా అరెస్ట్ : నగదు స్వాధీనం - telangana crime news

అబిడ్స్​లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Task force police nab eight people playing poker in Abids.
పేకాట ముఠా అరెస్ట్ : నగదు స్వాధీనం

By

Published : Mar 12, 2021, 7:39 AM IST

హైద‌రాబాద్‌ అబిడ్స్​లోని సంతోష్ దాబాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ రైడ్‌‌లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని ప‌ట్టుకున్నారు. వారిలో సంతోష్ దాబా ఓనర్, మ‌యూర్ పాన్ షాప్ ఓనర్​తో పాటు.. మరో ఆరుగురు వ్యాపార వేత్తలను అరెస్ట్ చేశారు.

వీరి వ‌ద్ద నుంచి రూ.73,860 న‌గ‌దును, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశ్వ‌సనీయ స‌మాచారంతో దాడులు చేసి వారిని తదుపరి విచారణ నిమిత్తం అబిడ్స్ పోలీసులకు అప్పజెప్పినట్లు మద్యమండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన రెస్క్యూ టీం

ABOUT THE AUTHOR

...view details