నకిలీ విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తోన్న ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని నాగారంలో ఇది జరిగింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న 13 కిలోల పత్తి విత్తనాలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Fake seeds: నకిలీ విత్తనాల పట్టివేత.. ముగ్గురి అరెస్ట్ - నకిలీ విత్తనాల అమ్మకం నేరం
పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా.. నకిలీ విత్తనాలు చలామణి అవుతూనే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలో నకిలీ విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 13 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
Fake seeds
నిందితుడు రవీందర్ రెడ్డి సమాచారంతో మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి:మహిళ మృతదేహాన్ని బావిలో పడేశారు.. తిరిగి వస్తూ పోలీసులకు చిక్కారు!