తెలంగాణ

telangana

ETV Bharat / crime

Hyderabad Drugs Case Update : డ్రగ్స్ కేసులో టోనీ ఏజెంట్లు అరెస్టు - తెలంగాణ తాజా వార్తలు

Hyderabad Drugs Case Update : పంజాగుట్ట మాదక ద్రవ్యాల కేసులో భాగంగా పోలీసులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న టోనీ అనుచరులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి వివరాలను సేకరిస్తున్నారు.

Hyderabad Drugs Case Update
డ్రగ్స్ కేసులో టోనీ ఏజెంట్లు అరెస్టు

By

Published : Feb 4, 2022, 11:40 AM IST

Hyderabad Drugs Case Update : పంజాగుట్ట మాదక ద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న టోనీ అనుచరులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు ఏజెంట్లు ఎవరెవరికి మాదక ద్రవ్యాలు విక్రయించారనే కోణంలో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. అఫ్తాబ్, ఆరిఫ్, ఇర్ఫాన్ అనే ముగ్గురు ఏజెంట్లు టోనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు నిర్వహించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. టోనీ దాదాపు 15 బ్యాంకు ఖాతాల్లో మాదక ద్రవ్యాల డబ్బులను జమ చేశాడు. అందులో ఆరిఫ్ అనే ఏజెంట్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలోనే కోటి రూపాయలు కేవలం ఆరు నెలల వ్యవధిలో జమ అయినట్లు ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు.

ఆరిఫ్ కొంత కమిషన్‌ను తీసుకొని మిగతా డబ్బు మొత్తాన్ని టోనీకి నగదు రూపంలో అందించాడు. ఆ నగదును ఆన్​లైన్ విధానంలో టోనీ నైజీరియాలోని పొలారిస్ బ్యాంకులో ఉన్న స్టార్ బాయ్ ఖాతాలో జమ చేసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. స్టార్‌బాయ్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని టాస్క్​ఫోర్స్ పోలీసులు సేకరించారు. బెంగళూర్​లోనూ టోనీ, ఏజెంట్లను నియమించుకొని మాదక ద్రవ్యాల దందా నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు బెంగళూరు పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి:Drugs Case: డ్రగ్స్​ కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. రహస్య ప్రాంతంలో విచారణ

ABOUT THE AUTHOR

...view details