హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేని బాగ్ ప్రాంతంలోని గాజుల కార్ఖనలో మైనర్ బాలలతో పని చేయిస్తున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 8 నుంచి 14ఏళ్ల వయసున్న 10 మంది పిల్లలతో గాజులు తయారు చేయిస్తున్నారని గుర్తించారు. వారందరు బిహార్ రాష్ట్రానికి చెందిన మైనర్లని పోలీసులు తెలిపారు.
Child labour: పాతబస్తీలో సోదాలు.. 10 మంది బాలకార్మికులకు విముక్తి - హైదరాబాద్ జిల్లా వార్తలు
హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేని బాగ్ ప్రాంతంలో గల గాజుల కార్ఖనలో మైనర్ బాలలతో పని చేయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.10 మంది పిల్లలతో గాజులు తయారు చేయిస్తున్నారని గుర్తించారు. వారందరిని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. వారితో పని చేయించుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసి... దర్యాప్తు చేస్తున్నారు.
Child labour
ఔరంగాజేబ్ అనే వ్యక్తి చిన్నారులతో గాజులు తయారు చేయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. విముక్తి కల్గించిన చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు... పోలీసులకు ఫిర్యాదు