తెలంగాణ

telangana

ETV Bharat / crime

అద్దె కార్లతో దొంగతనం.. ఒంటరి ప్రయాణికులే లక్ష్యం..

Robbery gang arrested: హైదరాబాద్​ మహానగరంలో రోజుకో ముఠా పెట్రరేగిపోతున్నారు. తాజాగా రాత్రి వేళలో ఒంటరి ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని కారులో ఎక్కించుకొని వారి దగ్గర నుంచి విలువైన వస్తువులను లాక్కొంటున్న ఓ ముఠాను గోపాలపురం పోలీసులు, టాస్క్​ ఫోర్స్ బృందం కలిసి పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి రెండు కార్లు 13 ఫోనులు స్వాధీనం చేసుకున్నారు.

Robbery gang arrested
Robbery gang arrested

By

Published : Dec 6, 2022, 7:49 PM IST

అద్దె కార్లతో దొంగతనం.. గుట్టురట్టు చేసిన పోలీసులు

Robbery gang arrested: హైదరాబాద్​ జంట నగరాల్లో కార్లు అద్దెకు తీసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి వేళల్లో టాక్సీల పేరుతో కార్లు నడిపి ఒంటరి ప్రయాణికులను ఎక్కించుకొని వారి దగ్గర నుంచి విలువైన వస్తువులు లాక్కొంటున్న ఈ ముఠాను గోపాలపురం పోలీసులు, టాస్క్​ఫోర్స్ బృందం కలిసి పట్టుకున్నారు.​ పోలీసుల కథనం ప్రకారం నగరానికి చెందిన ఖలీల్, మహబూబ్ బాషా, అబ్దుల్ హసన్, మహమ్మద్ ఖాన్​లు అద్దెకు కార్లను తీసుకొని రాత్రి వేళల్లో తిప్పుతుంటారు.

ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని వారిని కారులో ఎక్కించుకుంటారు. ఆ తర్వాత వారిని కత్తులతో బెదిరించి వారి దగ్గర నుంచి విలువైన ఆభరణాలు, సెల్​ ఫోనులు తీసుకొని వారిని ఎవరు లేని ప్రదేశంలో విడిచిపెట్టి వెళ్లిపోతారు. చిలకలగూడ నుంచి సంగీత్​ వైపుకు వెళ్తున్న ఈ ముఠాను గోపాలపురం పోలీసులు, టాస్క్​ఫోర్స్​ బృందం కలిసి సంయుక్తంగా చేధించి పట్టుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ చందన దీప్తీ పేర్కొన్నారు.

నిందితుల దగ్గర నుంచి 2 కార్లు 13 సెల్​ఫోన్​లు స్వాధీనం చేసుకున్నట్లు ఆమె వివరించారు. నిందితులపై గతంలో పలు నేరాలకు సంబంధించి కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికులు కార్లు అద్దెకు తీసుకున్నప్పుడు గాని ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రర్తలు తీసుకొవాలని డీసీపీ సూచించారు.

"హైదరాబాద్​కు చెందిన ఖలీల్​, మహబూబ్​ బాషా మరికొందరు కార్లు అద్దెకు తీసుకుంటారు. రాత్రి వేళలో వారు కార్లు నడిపి ఒంటరి వ్యక్తులను ఎక్కించుకుంటారు. ప్రయాణికులను బెదిరించి వారి దగ్గర నుంచి సెల్​ఫోన్​లు, విలువైన వస్తువులు తీసుకొని ఎవరు లేని ప్రదేశంలో వారిని విడిచిపెట్టి వెళ్లిపోతారు. నిందితులు దగ్గర రెండు కార్లు, 13 ఫోన్​లు తీసుకొని సీజ్​ చేశాం."- చందన దీప్తీ, డీసీపీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details