మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా మహంకాళి బారులో చోటుచేసుకున్న ఘటన మందుబాబులను ఉలిక్కి పడేలా చేసింది. పని ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో ఓ వ్యక్తి మద్యం షాపులో కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీరు కొనుగోలు చేశాడు. బయటకు తీసుకెళ్లి తాగుతున్న సమయంలో అందులో ఉన్న సిరంజీని(Syringe in beer bottle) చూసి కంగు తిన్నాడు.
Syringe in beer bottle: బీరు సీసాలో సిరంజీ .. ఉలిక్కి పడ్డ మద్యం ప్రియుడు - తెలంగాణ వార్తలు
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘటన తెలిస్తే మందు ప్రియులు ఉలిక్కి పడటం ఖాయం. పని ముగించుకుని వెళ్తున్న ఓ వ్యక్తి మద్యం షాపులో బీరు కొనుగోలు చేశాడు. బయటకు తీసుకెళ్లి తాగుతున్న సమయంలో అందులో ఉన్న సిరంజీని(Syringe in beer bottle) చూసి అవాక్కయ్యాడు. కిక్కు మాట దేవుడెరుగు.. ప్రాణం పోయేదంటూ లబోదిబోమన్నాడు.
Syringe in beer bottle
క్కుకోసం బీరు కొంటే చిక్కొచ్చిపడిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు దుకాణంపై, బీరు కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇకనైన మద్యం ప్రియులు గుటక వేసే ముందు ఓసారి చూసి తాగండి.
ఇదీ చదవండి:Fake CID Arrest: సీఐడీ అధికారినంటూ మహిళను వేధించిన కామాంధుడు... చివరకు..