సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నవరస గార్డెన్ వెనుక ఉన్న మోహన్‌రావు కాలనీలో అశోక్(29) అనే స్విగ్గీ డెలివరీ బాయ్ ఉరేసుకుని మృతిచెందాడు. ఉరేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకుని మరీ మిత్రులకు పంపించాడు. ఈ వీడియోలో కన్నయ్య అని సంబోధిస్తూ.. ఓ వ్యక్తికి సందేశం ఇచ్చాడు. అయితే అది ఎలాంటి సందేశమన్నది స్పష్టంగా తెలియకపోవటంతో ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు.
అశోక్‌కు మూడేళ్ల కిందట వివాహం జరిగింది. ఉదయం అతడి భార్య తల్లిదండ్రులు.. నగరంలో ఓ పని నిమిత్తం వచ్చారు. ఆ పని ముగించుకుని సాయంకాలం తిరిగి ఇంటికి వచ్చే లోపే అశోక్ విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అశోక్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.