తెలంగాణ

telangana

ETV Bharat / crime

సినీ ఫక్కిలో కర్ణాటకకు చెందిన స్వామిజీ కిడ్నాప్​.. - కర్నాటక స్వామిజీ కిడ్నాప్

కర్ణాటకకు చెందిన అమ్మాజీ అనే స్వామిజీని సినీ ఫక్కిలో దుండగులు కిడ్నాప్ చేశారు. విమానంలో షిర్డీ వెళ్దామని నమ్మించి అపహరించారు. ఓ గదిలో బంధించి డబ్బులు డిమాండ్ చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి బయటపడ్డ స్వామిజీ...నిందితులు గత నాలుగు రోజులుగా చాలా చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

swamiji kidnap
swamiji kidnap

By

Published : Jan 23, 2021, 8:53 AM IST

Updated : Jan 23, 2021, 10:37 AM IST

కర్ణాటక రాష్ట్రానికి చెందిన అమ్మాజీ అనే స్వామిజీ కిడ్నాప్​ కలకలం రేపింది. బార్లీ జిల్లా కపిలాపూర్ గ్రామం నుంచి స్వామిజీని దుండగులు కిడ్నాప్ చేశారు. విమానంలో షిర్డీ వెళ్దామని నమ్మించి భాస్కర్ రెడ్డి, సతీశ్​ అనే ఇద్దర వ్యక్తులు ఓ కారులో హైదరాబాద్​ తీసుకొచ్చారని స్వామిజీ ఆరోపించారు. ఇక్కడి నుంచి శంషాబాద్ మీదుగా బెంగళూరు తీసుకెళ్లారని తెలిపారు.

ఓ గదిలో బంధించి రూ.20 కోట్లు, కిలో బంగారం లేదా పది ఎకరాల వ్యవసాయం భూమి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు స్వామిజీ చెప్పారు. గత నాలుగు రోజులుగా చాలా చిత్రహింసలకు గురిచేశారన్నారు. తాము డిమాండ్ చేసింది ఇవ్వకపోతే తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.5 కోట్లు ఇస్తానని ఒప్పుకోవడంతో తిరిగి హైదరాబాద్​కు తీసుకొచ్చారని వివరించారు.

హైదరాబాద్ చేరుకోగానే గుండెనొప్పి వస్తోందని స్వామిజీ నాటకం ఆడారు. తనను వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని కోరారు. ఎట్టకేలకు కిడ్నాపర్ల గురించి వైద్యుని ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. కిడ్నాపర్లపై కేసు నమోదు చేయకుండానే లంగర్​హౌస్​ సీఐ వదిలిపెట్టారని స్వామిజీ ఆరోపించారు. వాళ్లు మానసికంగా, శారీరకంగా హింసించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి :రోగ నిరోధక శక్తిలో నీరే కీలకం

Last Updated : Jan 23, 2021, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details