తెలంగాణ

telangana

ETV Bharat / crime

అనుమానస్పద రీతిలో 80 గొర్రెలు మృతి.. అసలేం జరిగింది..? - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో 80 గొర్రెలు అనుమానస్పద రీతిలో మృతి చెందాయి. సుమారు పది లక్షల ఆస్తి నష్టం జరిగిందని .. ప్రభుత్వం తమను ఆదుకోవాలని గొర్రెల కాపరులు కోరుతున్నారు .

గొర్రెలు మృతి
గొర్రెలు మృతి

By

Published : Jun 9, 2022, 8:47 PM IST

అనుమానస్పద రీతిలో 80 గొర్రెలు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైకని అంజయ్యకు , బినమొని అంజయ్య లకు చెందిన సుమారు 80 గొర్రెలను బుధవారం రాత్రి అనుమానస్పద రీతిలో మృతి చెందాయి. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు గొర్రెలను పరిశీలించి కుక్కలు లేదా ఐనా దాడి చేసినట్టుగా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. తమ జీవనోపాధి అయిన గొర్రెలు మృతి చెందడం వల్ల సుమారు పది లక్షలు నష్టపోయామని.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల కాపరులు కోరుతున్నారు.

గతంలో యాచారం మండల పరిధిలోని తడిపర్తి, నానక్ నగర్,మేడిపల్లి, నందివనపర్తి గ్రామాల్లో తరుచుగా చిరుత మందలపై దాడి చేసేవని .. ఇప్పుడు దాదాపు 80 గొర్రెలు మృతి చెందడం ఇదే మొదటి సారని స్థానికులు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న ఆధికారులు మాత్రం శాశ్వత పరిష్కారం చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details