తెలంగాణ

telangana

ETV Bharat / crime

సైదాబాద్​లో యువకుడి అనుమానాస్పద మృతి - telangana varthalu

యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హైదరాబాద్​లోని సైదాబాద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

young man died in saidabad
సైదాబాద్​లో యువకుడి అనుమానాస్పద మృతి

By

Published : Apr 8, 2021, 12:05 PM IST

యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సైదాబాద్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బొరేగావ్ గ్రామానికి చెందిన రాములు కుటుంబం సైదాబాద్ కాలనీలో నివసిస్తోంది. అతని కుమారుడు అరుణ్ కుమార్(24) పంజాగుట్టలోని పీవీఆర్​ మాల్​లో పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం బయటకు వెళ్లిన అతను మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. సాయంత్రం విధులకు పంపేందుకు కుటుంబ సభ్యులు లేపే ప్రయత్నం చేయగా అతను లేవలేదు. తమ కుమారుడికి ఏమైందోనన్న భయంతో 108 అంబులెన్స్​కు ఫోన్​ చేశారు.

వారి సమాచారంతో అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది అప్పటికే అరుణ్ చనిపోయాడని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు... మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: దారుణం: భార్యను హతమార్చిన భర్త

ABOUT THE AUTHOR

...view details