తెలంగాణ

telangana

ETV Bharat / crime

కామారెడ్డిలో యువకుడు అనుమానాస్పద మృతి - తెలంగాణ వార్తలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మద్యం సేవించినందుకు అతని తండ్రి కొట్టాడు. ఆ గాయాలతోనే మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Suspicious death of a young man in kamareddy district
కామారెడ్డిలో యువకుడు అనుమానాస్పద మృతి

By

Published : Feb 8, 2021, 10:18 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారత్ రోడ్​లో మనీశ్​(19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మృతదేహంపై గాయాలు ఉండడం వల్ల హత్యగా భావిస్తున్నారు.

'అదివారం రాత్రి మనీశ్​ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఇది గమనించిన తండ్రి బ్రహ్మం.. కోపంతో మనీశ్​​ను చితక బాదాడు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న మనీశ్​ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మృతి చెందాడు' అని కామారెడ్డి పట్టణ సీఐ మధుసూదన్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: పేకాట స్థావరంపై భువనగిరి ఎస్ఓటీ పోలీసుల దాడులు

ABOUT THE AUTHOR

...view details