తెలంగాణ

telangana

ETV Bharat / crime

police suspended: చెల్లి పెళ్లి... గోవాలో క్రికెట్ బెట్టింగ్.. కానిస్టేబుల్ సస్పెన్షన్ - తెలంగాణ వార్తలు

గోవాలో బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడిన కానిస్టేబుల్​ను సస్పెండ్(police suspended) చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. చెల్లి పెళ్లి ఉందని చెప్పి సెలువులు తీసుకొని... గోవా వెళ్లినట్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి... సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

police suspended, conistable suspension
కానిస్టేబుల్​పై సస్పెన్షన్, టాస్క్​ఫోర్స్ కానిస్టేబుల్ సస్పెండ్

By

Published : Oct 30, 2021, 1:14 PM IST

చెల్లెలు పెళ్లి ఉందని చెప్పి గోవాలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడ్డ ఓ టాస్క్​ఫోర్స్ కానిస్టేబుల్​ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్(police suspended) చేశారు. టాస్క్​ఫోర్స్​లో పనిచేసే కానిస్టేబుల్ ఇమ్రాన్... తన చెల్లెలు పెళ్లి ఉందని చెప్పి పదిహేను రోజుల క్రితం గోవాకు వెళ్లినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఐపీఎల్​తో పాటు ప్రస్తుత టీ-20 బెట్టింగ్​లకు పాల్పడినట్లు వెల్లడించారు. భారత్-పాక్ మ్యాచ్(Bharat-Pak match 20210 సందర్భంగా భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తుండగా... గోవా పోలీసులు దాడి చేసి పట్టుకున్న వారిలో ఇమ్రాన్ సైతం ఉన్నట్లు వివరించారు.

గోవా పోలీసులు తొలుతగా సైబరాబాద్ ఎస్​వోటీ పోలీసులకు సమాచారం అందించారు. గోవా పోలీసుల సమాచారంతో నగర పోలీసు అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ చిక్కినట్లు పోలీసులు ధ్రువీకరించుకున్నట్లు వెల్లడించారు. ఇమ్రాన్​ను మూడు రోజుల క్రితం పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్(police suspended) చేశారు. పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా స్థానిక టాస్క్​ఫోర్స్ పోలీసులు సైతం ఇమ్రాన్ గత వ్యవహారశైలిపై దృష్టి పెట్టారు. ఇక్కడ ఆయనతో పాటు మరెవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి: పునీత్ పార్థివ దేహాం వద్ద బాలకృష్ణ కన్నీటి పర్యంతం

ABOUT THE AUTHOR

...view details