హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిక్ నన్పూర్ వద్ద ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి(suspicious death) చెందింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గోల్కొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయగా సదరు మహిళ చిన్నమ్మగా గుర్తించారు.
suspicious death: పీఎస్ పరిధిలో మహిళ మృతి - గోల్కొండ పోలీస్ స్టేషన్
హైదరాబాద్ గోల్కొండ పీఎస్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో(suspicious death) మరణించింది. హత్యకు గల కారణాలపై పోలీసులు పలు విధాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అతని భర్తను ఆరా తీసి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
suspicious death: పీఎస్ పరిధిలో మహిళ మృతి
ఆమె భర్తను విచారించగా నిన్న పని కోసం వెళ్లిన తాను తిరిగి రాలేదని, నిన్నటి నుంచి తనను వెతుకుతున్నామని ఆయన పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యానా? ఇతర కారణాల వల్ల చనిపోయిందా, ఆర్థిక కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి ఆసిఫ్ నగర్ ఏసీపీ శివ మారుతి చేరుకుని పర్యవేక్షించారు.
ఇదీ చూడండి:Chain theft: పుస్తెలతాడు దొంగతనం.. నిందితుడు అరెస్టు