తెలంగాణ

telangana

ETV Bharat / crime

ADVOCATE SUSPECTED DEATH: అనుమానాస్పద స్థితిలో సుప్రీంకోర్టు న్యాయవాది మృతి - అనుమానాస్పద స్థితిలో సుప్రీంకోర్టు న్యాయవాది మృతి

ADVOCATE SUSPECTED DEATH: అనుమానాస్పద స్థితిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని లక్డీకపూల్‌లోని ఓ హోటల్‌లో గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ADVOCATE SUSPECTED DEATH
అనుమానాస్పద స్థితిలో న్యాయవాది మృతి

By

Published : Feb 7, 2022, 10:48 AM IST

ADVOCATE SUSPECTED DEATH: హైదరాబాద్‌ లక్డీకపూల్‌లో సుప్రీంకోర్టు న్యాయవాది అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆయన గుండెపోటు, ఆరోగ్య సమస్యల కారణంగా మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నప్పటికీ... కేసు మాత్రం అనుమానాస్పద మృతి కింద నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అన్ని విషయాలు బయటపడతాయని చెబుతున్నారు.

అసలు ఏం జరిగిందంటే...

ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 77 ఏళ్ల సాయిబాబు... తరచూ హైదరాబాద్‌ వచ్చి వెళ్తుంటారు. ఆయన భాగ్యనగరానికి ఎప్పుడు వచ్చినా.. లక్డీకపూల్‌లోని బాధం బాలకృష్ణ హాటల్‌లో బస చేస్తుంటారు. అదే విధంగా ఇటీవల నగరానికి వచ్చిన ఆయన అదే హాటల్‌లో బస చేశారు. ప్రతి రోజు ఆయన ఉదయమే కుటుంబసభ్యులకు ఫోన్‌ చేస్తారు. ఈ నెల 5న సాయిబాబు కుటుంబసభ్యులకు ఫోన్‌ చేయలేదు.

దీంతో ఆందోళన చెందిన వారు హోటల్‌కు ఫోన్‌ చేసి ఆయన గురించి అడిగారు. హోటల్‌ సిబ్బంది ఆయన ఉంటున్న గది తెరిచి చూడగా బాత్‌రూంలో పడిపోయి ఉన్నారు. అయితే గుండెపోటు కారణంగానే మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన ఉంటున్న గదికి ఎవరు రాలేదని హోటల్‌ సిబ్బంది చెబుతున్నారు. పోలీసులు ముందుగా అనుమానాస్పద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

ఇదీ చదవండి:Couple Suicide: నువ్వు లేక నేనూ లేను.. చావు లోనూ నీకు తోడుగా ..

ABOUT THE AUTHOR

...view details