తెలంగాణ

telangana

ETV Bharat / crime

suicide: పెళ్లయిన 40 రోజులకే వివాహిత ఆత్మహత్య.. కారణం అదే! - అనంతపురం

కలకాలం కలిసి ఉంటానని ఏడు అడుగులు వేశాడు. కానీ వివాహమైన నాటి నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు భరించలేక పెళ్లయిన 40 రోజులకే ఆ వివాహిత ఉరివేసుకొని తనువు చాలించింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

Suicide
Suicide

By

Published : Oct 10, 2021, 3:15 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో వివాహిత పల్లవి(28) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వేధింపులు భరించలేక పెళ్లయిన 40 రోజులకే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

హిందూపురం పట్టణానికి చెందిన లక్ష్మీదేవి, వెంకటేశుల రెండో కుమార్తె పల్లవిని(28) ఇదే జిల్లాలోని పామిడి గ్రామానికి చెందిన మల్లికార్జునతో ఆగస్టు 27న వివాహం జరిపించారు. అయితే పెళ్లయిన మొదటి రోజు నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధించేవారని.. ఈ క్రమంలో అదనపు కట్నం తీసుకురావాలని మూడు రోజుల క్రితం హిందూపురానికి పంపినట్లు తెలుస్తోంది.

వేధింపులు తాళలేక తమ కుమార్తె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూపురం ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: Wife murdered husband: ఇద్దరు కుమార్తెల పెళ్లి చేసింది.. కానీ ఆ యువకుడి మోజులో పడి...

ABOUT THE AUTHOR

...view details