నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. మండలంలోని సికింద్రాపూర్ శివారులోని ఓ దేవాలయంలో పురుగుల మందు తాగి మరణించారు. చిత్తరి సాయిలు, శైలజలు ఆర్మూర్ మండలం ఆలూరుకు చెందిన వారిగా గుర్తించారు.
గుడిలో పురుగుల మందు తాగి సూసైడ్ - Suicide at temple
ఇద్దరు వ్యక్తులు ఆలయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు సేవించి మృత్యువాత చెందారు. వారి మరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. వారు గుడికి వచ్చి ఎందుకు మరణించారు? ఆర్థిక కారణాలు ఏవైనా ఉన్నాయా ? అనే పలు కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుడిలో పురుగుల మందు తాగి సూసైడ్
శుక్రవారం తెల్లవారుజామున ఆలూరు నుంచి సికింద్రాపూర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి పురుగుల మందు సేవించి మృత్యువాత చెందారు. ఇద్దరికీ పెళ్లి కాగా.. ఇటీవలే శైలజ భర్త చనిపోయాడు. ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం బయట పడటం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి :పాన్ షాప్ నిర్వాహకుడు మృతి