suicide attempt: పెళ్లైన వారం రోజులకే నవ దంపతుల ఆత్మహత్యాయత్నం - new married couple suicide attempt
11:09 June 21
suicide attempt: పెళ్లైన వారం రోజులకే నవ దంపతుల ఆత్మహత్యాయత్నం
ఆ దంపతులకి పెళ్లై వారం రోజులు దాటింది. వారిద్దరూ ఒకరినొకరు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఒకరి ఇష్టాలు, అభిప్రాయాలు తెలుసుకునే క్రమంలో వారి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో గొడవలు జరిగాయి. అది కాస్తా చిలికిచిలికి ఆత్మహత్యాయత్నం చేసుకునే స్థాయికి చేరింది. గమనించిన బంధువులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
నిజామాబాద్ జిల్లాలో వేల్పూరు మండలం పచ్చల నడుకుడలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరికి ఈ నెల 13న వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య విభేదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అసలు వారి ఆత్మహత్యాయత్నానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆర్థిక కారణాలు ఏవైనా ఉన్నాయా లేదా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలే కారణమా... తదితర కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదీ చూడండి:ముగ్గుర్ని నరికి చంపిన కేసులో నిందితుల కోసం ప్రత్యేక బృందాలు