పురుగుల మందు తాగి.. ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో జరిగింది.
మందలపల్లి సర్పంచ్ దుర్గ.. గ్రామ పంచాయతీ నిధుల్లో అవకతవకలకు పాల్పడిందంటూ.. కొంత కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా డీఎల్‌పీఓ హరి ప్రసాద్ విచారణ కోసం గ్రామానికి వచ్చారు.