తెలంగాణ

telangana

ETV Bharat / crime

జగిత్యాలలో ఉద్రిక్తంగా మారిన చెరుకు రైతుల ధర్నా

Sugarcane farmers protest: జగిత్యాలలో చెరుకు రైతులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనలకు అనుమతి లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహించిన రైతులు డీఎస్పీని నెట్టివేశారు.

జగిత్యాలలో ఉద్రిక్తంగా మారిన చెరకు రైతుల ధర్నా
జగిత్యాలలో ఉద్రిక్తంగా మారిన చెరకు రైతుల ధర్నా

By

Published : Jun 19, 2022, 3:33 PM IST

Updated : Jun 19, 2022, 4:48 PM IST

Sugarcane farmers protest: జగిత్యాలలో చెరుకు రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. గతవారం మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా.. చెరుకు రైతుల అరెస్ట్‌లపై వరుసగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే జగిత్యాలలోని చౌరస్తా వద్ద చెరకు రైతులు మరోసారి నిరసనకు దిగారు. ధర్నాకు అనుమతి లేకపోవటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.

ఈ క్రమంలోనే రైతు సంఘం నేత పన్నాల తిరుపతి రెడ్డి.. డీఎస్పీ ప్రకాశ్‌ను నెట్టి వేశారు. దురుసుగా ప్రవర్తించారనే కారణంతో నిరసనకారులను పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

జగిత్యాలలో ఉద్రిక్తంగా మారిన చెరకు రైతుల ధర్నా
Last Updated : Jun 19, 2022, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details