students missing: నలుగురు విద్యార్థులు అదృశ్యం.. ఎందుకంటే.. - గుంటూరు వార్తలు
![students missing: నలుగురు విద్యార్థులు అదృశ్యం.. ఎందుకంటే.. students missing, students missing in mangalagiri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13837693-thumbnail-3x2-missing.jpg)
07:54 December 07
తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో వెళ్లిపోయిన విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. నిన్న ఉదయం పాఠశాలలో బ్యాగులు పెట్టిన విద్యార్థులు.. తరగతులకు హాజరు కాకుండా బయటకు వెళ్లారు. ఏమి ఎరుగనట్లు సాయంత్రం స్కూలుకు వచ్చి బ్యాగులు తీసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు.. తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తామని.. ఇంకోసారి ఇలా చేయొద్దని హెచ్చరించారు.
ఉపాధ్యాయులు ఇంట్లో తమ సంగతి చెప్పేస్తారని.. తల్లిదండ్రులు తమను మందలిస్తారని.. పిల్లలు భయపడిపోయారు. బ్యాగులు తీసుకుని పాఠశాల నుంచి బయలుదేరారు కానీ.. ఇంటికి చేరుకోలేదు. నలుగురు కలిసి భయంతో ఎక్కడికో వెళ్లిపోయారు. ఎక్కడ వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అదృశ్యమైన విద్యార్థులు వెంకట్, ప్రభుదేవా, సంతోష్, వెంకీగా గుర్తించారు. పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: