Students Gang War at LB Nagar : రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కళాశాలల విద్యార్థుల గ్యాంగ్‌లు హంగామా సృష్టించాయి. రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన చిన్న వాగ్వాదం పెద్ద గొడవకు దారితీసింది. ఒకరిపై మరొకరు దాడికి దిగగా.. ఓ గ్యాంగ్ ఆ కాలనీలోని ఒకరి ఇంట్లో చొరబడి దాక్కుంది. మరో గ్యాంగ్‌లోని విద్యార్థులు వాళ్లని వెంబడించి ఆ ఇంటికి వెళ్లి వారిపై దాడి చేశారు. అడ్డుకున్న ఇంటి యజమానులపైనా దాడికి తెగబడ్డారు.
Students Gang War at LB Nagar : ఎల్బీనగర్లో స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ - ఎల్బీనగర్లో స్టూడెంట్స్ గ్యాంగ్ వార్
Students Gang War at LB Nagar : రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పరిధిలో రెండు కాలేజీ విద్యార్థుల గ్యాంగ్‌లు హల్‌చల్ చేశాయి. సిరినగర్ కాలనీలో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ముగ్గురు విద్యార్థులు ఓ ఇంట్లో దాక్కోగా.. మరో గ్యాంగ్ ఆ ఇంట్లోకి వెళ్లి బీభత్సం సృష్టించింది. అడ్డుకున్న ఇంటివారిపైనా దాడికి దిగింది.

Students Gang War at LB Nagar
ఎల్బీనగర్లో స్టూడెంట్స్ గ్యాంగ్ వార్
Gang War at LB Nagar : ఇంటి యజమానులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు రాగానే విద్యార్థులు ఎక్కడివాళ్లక్కడ పరారయ్యారు. ముగ్గురు విద్యార్థులను మాత్రం పోలీసులు పట్టుకోగలిగారు. వారిని అదుపులోకి తీసుకున్న విచారిస్తున్నారు. పరారైన వారి కోసం గాలిస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారు.
Last Updated : Jan 8, 2022, 4:59 PM IST