auto crashes into canal: కరీంనగర్ జిల్లా కేంద్రం రేకుర్తి శివారు ప్రాంతంలో ఆటో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఆటోలో నలుగురు స్కూల్ విద్యార్థులు ఉన్నారు. వెంటనే గమనించిన స్థానికులు జేసీబీ సాయంతో ఆటోను బయటకు తీసి విద్యార్థులను కాపాడారు. ఘటనలో ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నగరంలోని షేకాభి కాలనీకి చెందిన పాఠశాల విద్యార్థులు స్కూలుకు వెళుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటోడ్రైవర్ మైనర్ కాగా ఫోన్ మాట్లాడుతూ ఆటో నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. వెంటనే మేడారం జాతర ఏర్పాట్లలో పని చేస్తున్న జేసీబీ సాయంతో ఆటోను, పిల్లలను సురక్షితంగా బయటికి తీశారు. ఆదివారం కరీంనగర్ ప్రమాద ఘటన ఇంకా మరువకముందే జరిగిన ఈ ఘటనతో కలకలం రేపింది.