నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అశోక్ సాగర్ పార్కు చెరువులో దూకి మానసిక పరిస్థితి సరిగా లేని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్ అనే విద్యార్థి నిజామాబాద్‌లోని ఓ కాలేజీలో చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడని 6వ టౌన్ ఎస్సై సాయన్న తెలిపారు.
చెరువులో దూకి విద్యార్థి ఆత్మహత్య! - తెలంగాణ వార్తలు
హాస్టల్లో ఉంటూ చదువుకునే విద్యార్థి చెరువులో దూకి చనిపోవడం నిజామాబాద్‌లో కలకలం రేపింది. మానసిక స్థితి సరిగా లేకనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడని ఎస్సై తెలిపారు.
మానసిక పరిస్థితి సరిగా లేక విద్యార్థి ఆత్మహత్య!
విద్యార్థి నిర్మల్ జిల్లా భైంసా మండలం బేగాం గ్రామానికి చెందినవాడని ఎస్సై వెల్లడించారు. మానసిక పరిస్థితి సరిగా లేక... ఒంటరిగా హాస్టల్లో ఉండడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు.
ఇదీ చదవండి:విషాదం: అమ్మనాన్న లేరని యువకుడి ఆత్మహత్య
Last Updated : Feb 10, 2021, 10:57 AM IST