Student Sucide in JNTUH: హైదరాబాద్ జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సీఎస్‌ఆర్ భవనం పైనుంచి దూకి విద్యార్థిని మేఘనారెడ్డి ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన మనోజ్ కుమార్ రెడ్డి తన కుమార్తె మేఘన రెడ్డి, కుటుంబంతో కలిసి కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో నివాసం ఉంటున్నాడు. మేఘన రెడ్డి జేఎన్టీయూహెచ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో 4వ సంవత్సరం చదువుతున్నది.
జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయ విద్యార్థిని ఆత్మహత్య - hyderabad latest news
Student Sucide in JNTUH: నేటి యువతను ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఒత్తిడి. చిన్న చిన్న కారణాల వల్ల ఒత్తిడికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కన్నవారికి తీరని గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఓ విద్యార్థిని తాజాగా విశ్వవిద్యాలయంలో భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది
![జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయ విద్యార్థిని ఆత్మహత్య Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17335965-282-17335965-1672239124374.jpg)
ఈ రోజు యూనివర్సిటీ క్యాంపస్‌లోని క్లాస్ రూం కాంప్లెక్స్ భవనంలో పరీక్షకు హాజరయ్యింది. మధ్యాహ్నం తల్లి మేఘనకి భోజనం చేయించి వెళ్లింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మేఘన.. అదే భవనం పైఅంతస్తుకు ఎక్కి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన మేఘనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మేఘన గత కొద్ది రోజులుగా మానసిక ఒత్తిడితో బాధపడుతుందని ఆత్మహత్యకు అదే కారణమై ఉంటుందని అధ్యాపకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపడుతున్నామని సీఐ తెలిపారు.
ఇవీ చదవండి: