డిగ్రీ విద్యార్థిని ఓ యువకుడు నమ్మించి మోసం చేసి అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రహమత్‌నగర్ పరిధి కార్మికనగర్‌లో నివసించే బీకాం చదివిన విద్యార్థిని ఉద్యోగం కోసం ఆమెజాన్ కంపెనీకి వెళ్లింది. అక్కడ ఆ కంపెనీ మేనేజర్ బీటెక్ పూర్తి చేసిన రాజు పరిచయమయ్యాడు.
ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపి యువతిపై అత్యాచారం - telangana varthalu
ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపి తనపై మేనేజర్ అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపి యువతిపై అత్యాచారం
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి తన గదికి పిలిపించుకుని అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో డెంటల్ విద్యార్థిని మృతి