తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్‌లో చోటు చేసుకుంది. మహబూబాబాద్‌లోని కొత్తగూడ మండలం ఎదుల్లపల్లి గ్రామానికి చెందిన కూస సంపత్‌కు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో చిన్న కుమార్తె కూస త్రిష ఇటీవల పదో తరగతి పాస్ అయింది.
SUICIDE: స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని... విద్యార్థిని ఆత్మహత్య - ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య
స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థిని క్షణికావేశంలో నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల ఆర్థిక స్థోమతను అర్థం చేసుకోకుండా ప్రాణం తీసుకుంది. ఆన్లైన్ క్లాసుల కోసం ఆరాటపడి... కన్నవారికి తీరని శోకం మిగిల్చింది.
ఆన్లైన్ క్లాసులు ఉన్నాయని... సెల్‌ఫోన్ కొనివ్వాలని త్రిష తండ్రిని కోరింది. ఇప్పుడు డబ్బులు లేవు... కొద్దిరోజులు ఆగుమని సంపత్ చెప్పగా... తీవ్ర మనస్తాపానికి గురైంది. తండ్రిని అర్థం చేసుకోకుండా... క్షణికావేశంలో పురుగులు మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను నర్సంపేట ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ త్రిష మృతి చెందింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తగూడ ఎస్సై సురేష్ కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:She Teams: మహిళలను యువకులే ఎక్కువ వేధిస్తున్నారు!