Suicide: ఇద్దరు యువతులతో ఓ ఎస్సై నడిపిన ప్రేమాయణం.. వారిలోని ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. తనను ప్రేమించి మోసం చేద్దామనుకున్న ఆ ఎస్సైని ఓ యువతి.. పెళ్లి చేసుకొని శుభం కార్డు వేసుకోగా.. మరో యువతి మాత్రం ప్రేమ విఫలమైందనే బాధతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పామిడి మండలం జి.ఏ కొట్టాల గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎస్సై విజయ్ కుమార్.. తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ముఖం చాటేశాడని.. ఓ డిగ్రీ విద్యార్థిని.. రెండు రోజుల క్రితం పురుగులమందు తాగింది. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అనంతపురంలో మృతిచెందింది.
ఈ క్రమంలో ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై విజయకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరిలో అతడిని అదుపులోకి తీసుకొని పామిడికి తీసుకెళ్లారు. ఎస్సైపై దిశ పోలీస్ స్టేషన్లో కొన్ని రోజుల కిందట ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఉద్యోగం పోతుందనే భయంతో ఎస్సై ఆ యువతిని ఇటీవలే వివాహం చేసుకున్నాడు. మనస్తాపంతో రెండో యువతి పామిడి మండలం జి.ఎ.కొట్టాలకు చెందిన సరస్వతి బాయి ఆత్మహత్యకు యత్నించింది. అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి నిన్న మృతి చెందింది. ప్రేమించి మోసం చేశాడని మృతురాలి బంధువులు పామిడి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై విజయకుమార్ నాయక్ స్వగ్రామం పామిడి మండలం జి.ఎ.కొట్టాల.
ఎస్సై విజయకుమార్‌పై కేసు నమోదు చేసినట్లు.. ఇవాళ రిమాండ్‌కు పంపుతున్నట్లు తాడిపత్రి డీఎస్పీ చెప్పారు. ఇతనిపై గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులొచ్చాయని తెలిపారు. ఫిర్యాదులొస్తే వివాదాల మధ్యే విజయకుమార్ వివాహం జరిగిందని డీఎస్పీ వివరించారు.