మేడ్చల్ జిల్లా మల్లంపేటకు చెందిన రాజు, అతని భార్య కలిసి స్థానికంగా ఓ ఇస్త్రీ దుకాణం నడుపుతున్నారు. వీరి కుమారుడు యశ్వంత్(14) మల్లంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం తల్లి మందలించడంతో.. మనస్తాపం చెందిన బాలుడు.. తన సైకిల్ తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
అమ్మ మందలించిందని చెరువులో దూకి ఆత్మహత్య - Student commits suicide in Medchal district
తల్లి మందలించిందని.. చెరువులో దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో చోటుచేసుకుంది.
![అమ్మ మందలించిందని చెరువులో దూకి ఆత్మహత్య Student commits suicide by jumping into Mallampeta pond, Dundigal, Medchal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11221077-171-11221077-1617166452496.jpg)
అమ్మ మందలించిందని చెరువులో దూకి ఆత్మహత్య
రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లంపేట చెరువు వద్ద బాలుడి సైకిల్ లభ్యమవగా.. పోలీసులు చెరువులో గాలింపు చేపట్టారు. తెల్లవారుజామున మృతదేహం లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.