ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. విజయనగరం జిల్లా ఎస్. కోట మండలం గోజలం గ్రామానికి చెందిన పరమేష్ అనే విద్యార్థి.. నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాల వసతిగృహంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ట్రీపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య - ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య న్యూస్
ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ వసతిగృహంలో ఓ విద్యార్థి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం రేపింది. మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
![ట్రీపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య Triple IT student suicide in hostel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10584468-361-10584468-1613042090424.jpg)
ట్రీపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.