తెలంగాణ

telangana

ETV Bharat / crime

బ్లేడ్​తో విద్యార్థి గొంతుకోసిన తోటి విద్యార్థి - Gachibowli iit Gurukul campus

బ్లేడ్​తో విద్యార్థి గొంతుకోసిన తోటి విద్యార్థి
బ్లేడ్​తో విద్యార్థి గొంతుకోసిన తోటి విద్యార్థి

By

Published : Apr 29, 2022, 9:49 AM IST

Updated : Apr 29, 2022, 1:11 PM IST

09:44 April 29

గురుకుల క్యాంపస్‌లో విద్యార్థి గొంతుకోసిన మరో విద్యార్థి

హైదరాబాద్ గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ ఐఐటీ క్యాంపస్​లో ఈ నెల 25వ తేదీ రాత్రి ఇద్దరు విద్యార్థులు మద్య జరిగిన గొడవ హత్యాయత్నానికి దారితీసింది. సూర్యాపేట జిల్లా నారాయణగూడెం ప్రాంతానికి చెందిన సాత్విక్(17) గౌలిదొడ్డిలో ఇంటర్​ బైపీసీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వంశీ (18) ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆ రోజు సాయంత్రం అల్పాహారం తీనే సమయంలో సాత్విక్, వంశీల మధ్య గొడవ జరిగింది. ఉపాధ్యాయులు జోక్యం చేసుకుని వారిని సర్ది చెప్పి పంపించేశారు.

వంశీ అదే రోజు అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో సాత్విక్ గదిలోకి వెళ్లి బ్లేడ్​తో గొంతు కోశాడు. రక్తస్రావం కావడంతో సాత్విక్ కేకలు వేయడంతో ఉపాధ్యాయులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సకాలంలో విద్యార్థికి చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. మరుసటి రోజు మధ్యాహ్నం సాత్విక్ తల్లిదండ్రులు గచ్చిబౌలి పీఎస్​లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు విద్యార్థులు మైనర్లు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 29, 2022, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details