తెలంగాణ

telangana

ETV Bharat / crime

యువతిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న విద్యార్థి అరెస్ట్​ - telangana varthalu

సామాజిక మాధ్యమాల్లో పరిచయం పెంచుకుని ఓ యువతి ఫోన్​ నంబర్​ తీసుకున్నాడు. ఆమెతో క్రమంగా పరిచయం పెంచుకుని... వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సంపాదించాడు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. ఇంకా కావాలని పెద్ద మొత్తం అడగ్గా... యువతి తండ్రికి విషయాన్ని చెప్పింది. ఆయన పోలీసులను ఆశ్రయించడంతో చివరికి కటకటాల పాలయ్యాడు.

యువతిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న విద్యార్థి అరెస్ట్​
యువతిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న విద్యార్థి అరెస్ట్​

By

Published : Mar 13, 2021, 3:15 AM IST

తెలియని వ్యక్తులతో సామాజిక మాధ్యమాల్లో పరిచయం పెంచుకుని వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పంపిస్తూ వారి వలలో చిక్కుకుంటున్నారు యువతులు. తాజాగా మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాలకు చెందిన ఓ యువతి అలాగే చిక్కుకుంది. వరంగల్​కు చెందిన సుదీప్ కుమార్ యువతికి ఇన్​స్టాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడంతో ఆ యువతి అంగీకరించింది. తరచూ చాటింగ్ చేసుకున్న అనంతరం ఆ యువకుడు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మాయమాటలు నమ్మి తన ఫోన్ నెంబర్ ఇవ్వడం ఇద్దరూ వీడియో కాల్స్​తో పాటు వ్యక్తిగత ఫొటోలు షేర్ చేసింది ఆ యువతి.

తనకు డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని సుదీప్​ ఆ యువతిని బ్లాక్​మెయిల్​ చేశాడు. యువతి భయపడి వివిధ దశల వారీగా సుమారు లక్షా 30 వేల నగదు అతడికి పంపించింది. ఇక్కడితో ఆగకుండా ఇంకా డబ్బులు కావాలని వేధించడంతో యువతి తన తండ్రికి విషయాన్ని తెలిపింది. ఆమె తండ్రిని కూడా యువకుడు బ్లాక్​మెయిల్​ చేయడం ప్రారంభించాడు. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించడంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఇతడి బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నట్లు పేట్​బషీరాబాద్​ సీఐ రమేశ్​ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిలు వ్యక్తిగత విషయాలు షేర్​ చేయొద్దని ఆయన సూచించారు.

ఇదీ చదవండి: ఈబిజ్ డాట్ కామ్​ కేసు.. వెలుగులోకి కొత్త నిజాలు

ABOUT THE AUTHOR

...view details