తెలంగాణ

telangana

ETV Bharat / crime

Step Father records Daughter Bath Video : కుమార్తె స్నానం చేస్తుండగా వీడియో తీసి.. - father filmed daughters video while bathing

Step Father records Daughter Bath Video : తనకు, తన బిడ్డకు తోడుగా ఉంటాడనుకున్న ఆ తల్లి నమ్మకాన్ని తుంచేశాడు. కూతురికి ప్రేమను, అప్యాయతను పంచాల్సినవాడే మృగంలా ప్రవర్తించాడు. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వాడే కామంతో సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు. వావి వరుస మరిచి కుమార్తె స్నానం చేస్తుండగా రహస్యంగా చిత్రీకరించాడు.

Step Father Misbehaves with Daughter
Step Father Misbehaves with Daughter

By

Published : Feb 12, 2022, 2:29 PM IST

Step Father records Daughter Bath Video : వావి వరుసలు మరచి కూతురు పట్ల అనుచితంగా ప్రవర్తించాడో సవతి తండ్రి. బాత్‌రూమ్‌లో చరవాణిని రహస్యంగా ఉంచి బాలిక స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించాడు. చరవాణిలో వీడియోను గమనించిన తల్లి రెండో భర్త వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసి.. పోలీసులను ఆశ్రయించింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

విజయవాడ వన్‌టౌన్‌ గట్టు వెనుక ప్రాంతానికి చెందిన ఒక మహిళకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె 9వ తరగతి చదువుతోంది. భర్తతో విభేదాల కారణంగా అతనితో విడిపోయి ఓ మహిళ రెండో వివాహం చేసుకుంది. రెండో భర్త, తన పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 4న రాత్రి 9.30 గంటల సమయంలో సవతి తండ్రి.. ఇంట్లోని బాత్‌రూమ్‌లో చరవాణిని వీడియో మోడ్‌లో ఉంచి వరుసకు కూతురైన బాలిక స్నానం చేస్తుండగా చిత్రీకరించాడు.

ఫిబ్రవరి 10న ఉదయం 10 గంటల సమయంలో మహిళ తన రెండో భర్త చరవాణిలోని ఫొటోలు చూస్తుండగా.. కుమార్తె స్నానం చేస్తున్న వీడియో కనిపించింది. ఈ విషయమై రెండో భర్తతో గొడవ పడింది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details