పిడుగుపాటుతో 32 గొర్రెలు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ పరిధి పాత కొడంగల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్న బుగ్గయ్య యాదవ్ దంపతులు గొర్రెలను మేతకు తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో చెట్ల కింద వాటిని నిలిపారు. ఒక్కసారిగా పిడుగుపడటంతో 32 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
కొడంగల్ పరిధిలో పిడుగుపాటుతో 32 గొర్రెలు మృతి - ssheep died of thunder storm in paathakota village
వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ పరిధిలో పిడుగుపాటుతో 32 గొర్రెలు మృతి చెందాయి. రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితులు ఆరోపించారు.
పిడుగుపాటుతో గొర్రెలు మృతి
కళ్లముందే అవి చనిపోవడం చూసి దంపతులు బోరున విలపించారు. ఘటనతో రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని వాపోయారు.
ఇదీ చదవండి: నిబంధనలు గాలికొదిలేసి.. ఓరుగల్లులో తెరాస సభలు, సమావేశాలు
Last Updated : Apr 22, 2021, 8:10 PM IST