పరీక్ష రాసి వెళ్తుండగా ప్రమాదం.. పదో తరగతి విద్యార్థి మృతి - నిజామాబాద్‌లో పదో తరగతి విద్యార్థి మృతి
11:05 May 28
నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. పదో తరగతి విద్యార్థి మృతి
Chandur Accident Today : రాత్రంతా కష్టపడి చదివాడు. పొద్దున్నే లేచి మరోసారి రివిజన్ చేశాడు. త్వరగా రెడీ అయి పరీక్షా కేంద్రానికి బైక్‌పై బయలుదేరాడు ఓ పదో తరగతి విద్యార్థి. కాస్త దూరం వెళ్లగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టాడు. అక్కడికక్కడే దుర్మణం చెందాడు.
నిజామాబాద్ జిల్లా చందూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి వికాస్ దుర్మరణం చెందాడు. కారేగాం నుంచి బిర్కూర్‌కు పరీక్ష రాసేందుకు వెళ్తుండగా చందూర్ శివారులో కల్వర్టును బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వికాస్ అక్కడికక్కడే మరణించాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరీక్ష కోసం వెళ్లిన కుమారుడి ప్రాణాలు పోయాయని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ తోటి విద్యార్థి మరణించాడని తెలిసి అతడి స్నేహితులు కంటతడి పెట్టారు.