గుజరాత్ ముఠా ఆన్‌లైన్ బెట్టింగ్.. రూ. కోటికి పైగా స్వాధీనం - online betting gang arrest in hyderabad
Online Betting in Hyderabad: ఆన్‌లైన్ బెట్టింగ్ గ్యాంగ్‌పై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తున్న గుజరాత్ ముఠాపై దాడి చేసి అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. కోటికి పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఆన్‌లైన్ బెట్టింగ్
Online Betting in Hyderabad: హైదరాబాద్‌లో కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న గుజరాత్ ముఠాను ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో శుక్రవారం రాత్రి బీకే గూడలోని ఒక ఇంటిపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గుజరాత్ ముఠా నుంచి రూ. కోటి 15 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు.